రోహిత్‌ది కోహ్లీ స్థాయి కాదు.. భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.. హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఫైర్

by Harish |

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్‌ది కోహ్లీ స్థాయి కాదు.. భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.. హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా దూరదర్శన్ ‘ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో’లో పాల్గొన్న మంజ్రేకర్.. రోహిత్‌ను భారత బ్యాటింగ్ దిగ్గజంగా చెప్పలేమన్నాడు. ‘ఆల్ టైం ఇండియన్ బ్యాటింగ్ లిస్ట్‌‌లో రోహిత్ సరిపోడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీల గురించి మాట్లాడుతున్నప్పుడు రోహిత్‌ను పరిగణించలేం. రోహిత్ అంతగా రాణించలేదు. పరిమిత ఓవర్లలో అతని ఆధిపత్యం ఆనందించేదే. ఓ వన్డే ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేశాడు. కానీ, ఆల్ టైం భారత బ్యాటింగ్ దిగ్గజాల గురించి చర్చ జరుగుతున్నప్పుడు టెస్టులది ప్రధాన పాత్ర ఉంటుంది. టెస్టుల్లో రోహిత్ ప్రభావం చూపించలేదు.’అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.

అయితే, కెప్టెన్‌గా ముఖ్యంగా వన్డేల్లో రోహిత్‌ నాయకత్వాన్ని అభినందించాడు. ‘వన్డే క్రికెట్‌లో అతని నిస్వార్ధత, నాయకత్వం గురించి చెప్పుకోవాల్సిందే. 2023 వరల్డ్ కప్ తర్వాత రోహిత్‌ను అభిమానించే వాళ్లు మరింతగా పెరిగారు. రోహిత్ తన గురించి ఆలోచించడని, జట్టు కోసం త్యాగాలకు కూడా వెనుకాడడని ప్రజలు నమ్మారు.’ తెలిపాడు. ఆల్ టైం గ్రేట్ బ్యాటర్లలో రోహిత్ లేడన్న మంజ్రేకర్ వ్యాఖ్యలపై హిట్‌మ్యాన్ అభిమానులు మండిపడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌‌లో రోహిత్ 19, 700 రన్స్ చేశాడు. ప్రస్తుతం అత్యధిక రన్స్ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా రోహిత్ కొనసాగుతున్నాడు. వన్డే ఫార్మాట్‌లో మూడు డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ అతనే. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిల్స్ అందించాడు. రోహిత్ ఘనతలను అభిమానులు ప్రస్తావిస్తూ మంజ్రేకర్‌ను విమర్శిస్తున్నారు.


Next Story