- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్మెంట్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు
రిటైర్మెంట్ వార్తలపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.

దిశ, స్పోర్ట్స్ : రిటైర్మెంట్ వార్తలపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ఆ వార్తలకు తనకు కొత్తేం కాదని, వాటికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు ముందు బుధవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ మాట్లాడాడు. ‘ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు, చాంపియన్స్ ట్రోఫీకి ముందు నా ప్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడటానికి ఇది సందర్భం కాదు. నా రిటైర్మెంట్‌పై కొన్ని ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. వాటిపై క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీ నాకు చాలా ముఖ్యం. వాటిపైనే ఫోకస్ పెట్టా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.’ అని తెలిపాడు. టెస్టుల్లో పేలవ ఫామ్ తర్వాత వన్డేల్లో సవాల్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమా? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రోహిత్ స్పందిస్తూ..‘టెస్టులు, వన్డేలు వేర్వేరు ఫార్మాట్‌లు. ఏ ఆటగాడికైనా ఎత్తుపల్లాలు సహజం. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాను. అయితే, ప్రతి రోజు, ప్రతి సిరీస్ కొత్తే.’అని వ్యాఖ్యానించాడు.






