గంభీర్ పరువు తీసిన రోహిత్ శర్మ.. ఖుషిలో ఫ్యాన్స్!

by velandi.Saikiran |

టీమిండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. ఛాంపియ‌న్స్ ట్రోఫీ

గంభీర్ పరువు తీసిన రోహిత్ శర్మ.. ఖుషిలో ఫ్యాన్స్!
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 టోర్న‌మెంట్ విజ‌యం వెనుక మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ పాత్ర ఉంద‌ని రోహిత్ శ‌ర్మ తెలిపారు. మంగ‌ళ‌వారం రోజున ముంబై వేదిక‌గా ఓ ఈవెంట్ లో రోహిత్ శ‌ర్మ‌, శ్రేయాస్ అయ్య‌ర్‌, సంజూ శాంస‌న్ హ‌జ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాట్లాడారు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 టోర్న‌మెంట్ విజ‌యం గురించి ప్ర‌స్తావిస్తూ, రాహుల్ ద్రావిడ్ ను మెచ్చుకున్నారు రోహిత్ శ‌ర్మ‌. వాస్త‌వానికి ఆ స‌మ‌యంలో టీమిండియా కోచ్ గా గౌత‌మ్ గంభీర్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే, కెప్టెన్సీ తొలగించ‌డంపై గుర్రుగా ఉన్న రోహిత్ శ‌ర్మ, ఇలా మాట్లాడ‌టం వివాదంగా మారింది. గంభీర్ కౌంట‌ర్ ఇచ్చేందుకే, రోహిత్ శ‌ర్మ మాట్లాడి ఉంటామ‌ని మ‌రికొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత చివరి మెట్టుపై టీమిండియా ఓడిపోయిందని గుర్తు చేశారు రోహిత్ శర్మ. అయితే ఇకపై అలా జరగకుండా రాహుల్ ద్రావిడ్ అనేక సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ స్ఫూర్తితోనే టి20 వరల్డ్ కప్ అలాగే ఛాంపియన్ ట్రోఫీ గెలిచామని గంభీర్ పేరు చెప్పకుండా రాహుల్ ద్రావిడ్ ప్రస్తావన తీసుకువచ్చారు రోహిత్ శర్మ. ఇలా గంభీర్ కు రోహిత్ శర్మ కౌంటర్ ఇవ్వడంపై ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు.

Next Story