టీ20 రిటైర్మెంట్ పై Rohit Sharma క్లారిటీ

by Malleboina Mahesh |   (  Updated:2023-01-10 05:56:16  IST  )

గత కొద్ది రోజులుగా రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అని అనేక వార్తలు వచ్చాయి. దీంతో రోహిత్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

టీ20 రిటైర్మెంట్ పై Rohit Sharma  క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ది రోజులుగా రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అని అనేక వార్తలు వచ్చాయి. దీంతో రోహిత్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఈ పుకర్లపై స్పందించిన రోహిత్ శర్మ తాను టీ20 ఫార్మాట్‌ను వదులుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే తాను గతంలోనే దీనిపై స్పష్టంగా చెప్పానని.. అన్నాడు. కొంతమంది కుర్రాళ్లకు అన్ని ఫార్మాట్లలో ఆడటం సాధ్యం కాదు. "కొంతమంది.. ఆటగాళ్ల పనిభారాన్ని చూసి.. వారికి విరామం ఇవ్వాలని అనుకున్నాం. నేనూ ఆ కోవలోకి వస్తాను" అని అన్నాడు. రోహిత్ మాటలను బట్టి చూస్తే తాను ఇప్పట్లో టీ20 లకు దూరంగా ఉండడని తెలుస్తుంది. కాగా త్వరలో జరగబోయే అన్ని టీ20లకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా నే కొనసాగించాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read...

ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన 19 ఏళ్ల పాక్ పేసర్

Next Story