- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్ మరో ఐదేళ్లు ఆడగలడు.. క్లాస్ ప్లేయర్‌పై విమర్శలా?
రోహిత్ తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడితే మరో ఐదేళ్లు ఆడగలడని, అలాంటి క్లాస్ ప్లేయర్‌పై విమర్శలు చేయడం తగదని యోగ్‌రాజ్ సింగ్ అన్నాడు.

దిశ, స్పోర్ట్స్: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ క్లాస్ ఆటగాడని, జట్టుకు మరో ఐదేళ్లు అతని అవసరం ఉంటుందని మాజీ దిగ్గజం యోగ్‌రాజ్ సింగ్ అన్నాడు. ఇప్పటికే టెస్టులు, టీ20లకు దూరమైన రోహిత్.. వన్డేల నుంచి కూడా తప్పుకోనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని ఇటీవలే బీసీసీఐ కూడా ఖండించింది. రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడంపై తమకు ఎలాంటి తొందర లేదని తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే యోగ్‌రాజ్ సింగ్ స్పందించారు.
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు రోహిత్ అందుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశాడు. ‘అందరూ రోహిత్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో అతని ఆట చూడండి. మిగతా టీం బ్యాటింగ్ అంతా ఒక ఎత్తు, రోహిత్ బ్యాటింగ్ ఒక ఎత్తు అని చెప్పాలి. అదే అతని క్లాస్’ అని చెప్పాడు. ‘రోహిత్.. నీ అవసరం జట్టుకు మరో ఐదేళ్లు ఉంది. దేశానికి ఇంకొంత సేవ చెయ్యాలి. ఫిట్‌నెస్, ఇతర విషయాలపై ఫోకస్ పెట్టు. తనపై నలుగురు మనుషులను పెట్టి, ప్రతిరోజూ 10 కిలోమీటర్లు పరిగెత్తించాలి.
అలా చేస్తే 45 ఏళ్ల వరకు దేశానికి ఆడే క్లాస్ అతని వద్ద ఉంది. ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడానికి తను దేశవాళీ క్రికెట్ ఆడాలి. ఎంత ఆడితే అంత ఫిట్‌గా ఉంటారు. ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడి గురించి ఎవరుపడితే వాళ్లు మాట్లాడకూడదు’ అని విమర్శకులపై పరోక్షంగా చురకలేశారు.






