వన్డేల్లో తిరిగి నం.1 బ్యాటర్‌ రోహిత్ శర్మ

by Harish |

భారత మాజీ కెప్టెన్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డేల్లో తిరిగి నం.1 బ్యాటర్‌గా అవతరించాడు.

వన్డేల్లో తిరిగి నం.1 బ్యాటర్‌ రోహిత్ శర్మ
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ కెప్టెన్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డేల్లో తిరిగి నం.1 బ్యాటర్‌గా అవతరించాడు. బుధవారం ఐసీసీ రిలీజ్ చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నాడు. గత నెలాఖరులో రోహిత్ కెరీర్‌లో తొలిసారిగా నం.1 ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. గత వారం న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్.. హిట్ మ్యాన్‌ను వెనక్కినెట్టి టాప్ పొజిషన్‌కు వెళ్లాడు. అయితే, వెస్టిండీస్‌తో చివరి రెండు వన్డే మ్యాచ్‌లకు మిచెల్ దూరంగా ఉన్నాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో అతను ఒక్క స్థానం కోల్పోయి రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. అది రోహిత్‌కు కలిసొచ్చింది. అతను ఒక్క స్థానం మెరుగుపర్చుకుని 781 రేటింగ్ పాయింట్లతో తిరిగి అగ్రస్థానం దక్కించుకున్నాడు. అలాగే, టాప్-10 బ్యాటర్లలో నలుగురు భారత బ్యాటర్లు ఉన్నారు. రోహిత్ తర్వాత గిల్, కోహ్లీ వరుసగా 4,5 స్థానాల్లో, శ్రేయస్ అయ్యర్ 9వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక బౌలర్లలోకుల్దీప్ 7వ స్థానంలో ఉండగా.. జడేజా, సిరాజ్ వరుసగా 14, 15 స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ విభాగంలో అక్షర్ పటేల్(9వ ర్యాంక్) టాప్-10లో కొనసాగుతున్నాడు.


Next Story