- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌కు చేరుకున్న రోహిత్ శర్మ.. ఆ క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే!
హైదరాబాద్(Hyderabad)లోని ఉప్పల్ మైదానం(Uppal Stadium) వేదికగా రేపు SRH, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని ఉప్పల్ మైదానం(Uppal Stadium) వేదికగా రేపు SRH, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఈ నేపథ్యంలోనే ముంబై ప్లేయర్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్లేయర్లు ఎయిర్‌పోర్టులో దిగగానే అభిమానులంతా తెగ అల్లరి చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ(Rohit Sharma) కనిపించగానే.. ‘ముంబై కా రాజా.. రోహిత్ శర్మ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. హై సెక్యూరిటీ ఉండటంతో అభిమానుల ఆశలు ఆవిరయ్యారు.
మరోవైపు ఇప్పటికే ఉప్పల్ మైదానంలో అడుగుపెట్టిన హైదరాబాద్(Sunrisers Hyderabad) ప్లేయర్లు తెగ సాధన చేస్తున్నారు. ముంబై(Mumbai Indians)పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఏడు మ్యాచులు ఆడిన హైదరాబాద్ జట్టు కేవలం రెండే గెలిచింది. అటు ముంబై వరుస విజయాలతో మాంచి ఊపుమీదున్నది. ఈ మ్యాచ్‌లో ఓడితే హైదరాబాద్ ఇంటిబాట పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే గెలిచి తీరాలని కసిమీద ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అదరగొట్టారు. ఈ సీజన్‌లో అన్ని మ్యాచుల్లో విఫలం అయిన రోహిత్ నిన్నటి మ్యాచ్‌తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. 45 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Rohit reached Hyderabad 🐯❤️ pic.twitter.com/rNzHGtyQLD
— Manojkumar (@Manojkumar_099) April 21, 2025






