- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rohit Sharma : టెస్టు రిటైర్మెంట్ మా నాన్నకు నచ్చలేదు
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రోహిత్ నిర్ణయం తన తండ్రి గురునాథ్ శర్మ నచ్చలేదట. టెస్టు ఫార్మాట్‌ను ఎంతో ఇష్టపడే ఆయన రోహిత్ టెస్టుల నుంచి తప్పుకున్నప్పుడు అసంతృప్తి వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా రోహిత్ శర్మనే వెల్లడించాడు. ముంబైలో శుక్రవారం సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా భార్య పూజ రాసిన ‘ది డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్’ అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. తన తండ్రి టెస్టు క్రికెట్‌కు బిగ్ ఫ్యాన్ అని చెప్పాడు. ‘మా నాన్న ఒక ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేసేవారు. మేము బాగుండాలని ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. మా నాన్నకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వన్డేల్లో 264 చేసిన రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆయన పెద్దగా ఉత్సాహంగా కనిపించలేదు. బాగా ఆడావు అని మాత్రమే చెప్పారు. కానీ, టెస్టుల్లో 30, 40, 50, 60 రన్స్ చేసినా దాని గురించి వివరంగా మాట్లాడేవారు. టెస్టు క్రికెట్‌పై ఆయనకు ఉన్న ప్రేమే ఇందుకు నిదర్శనం. అందుకే, నేను టెస్టు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఆయన కాస్త నిరాశ చెందారు. కానీ, ఆ తర్వాత ఆనందించారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన పాత్ర ఎంతో ఉంది. వారి పాత్ర లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు.’అని రోహిత్ చెప్పుకొచ్చాడు. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ ఇక కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగనున్నాడు.






