BGT 2024 : బ్రిస్బేన్ చేరిన రోహిత్ సారథ్యంలోని టీంఇండియా

by Sathputhe Rajesh |

రోహిత్ శర్మ సారథ్యంలోని టీం ఇండియా బుధవారం బ్రిస్బేన్‌కు చేరుకుంది.

BGT 2024 : బ్రిస్బేన్ చేరిన రోహిత్ సారథ్యంలోని టీంఇండియా
X

దిశ, స్పోర్ట్స్ : రోహిత్ శర్మ సారథ్యంలోని టీం ఇండియా బుధవారం బ్రిస్బేన్‌కు చేరుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా గబ్బా వేదికగా మూడో టెస్టులో తలపడనున్నాయి. శనివారం నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు జట్లు 1-1తో సిరీస్‌ను సమం చేశాయి. అడిలైడ్ టెస్ట్‌లోబ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్, బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ రాణించడంతో ఆస్ట్రేలియా10 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. ఇక మూడో టెస్ట్ రెండు జట్లకు కీలకం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎలాగైనా క్వాలిఫై భావిస్తున్న ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని భావిస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా జట్టు ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. బుమ్రా, మహమ్మద్ సిరాజ్ మాత్రం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదు.

Next Story