అడిలైడ్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఫైనల్‌కు బోపన్న జోడీ

by Dishanational3 |
అడిలైడ్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఫైనల్‌కు బోపన్న జోడీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ సీనియర్ డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించడానికి అడుగుదూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న అడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న తన పార్ట్‌నర్ మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా)తో కలిసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో బోపన్న జోడీ 6-4 , 6-4 తేడాతో గొంజాలో ఎస్కోబార్(ఈక్వెడార్)-అలెగ్జాండర్ నెడోవిసోవ్(కజకిస్తాన్) జోడీపై విజయం సాధించింది. నేడు ఫైనల్‌లో బోపన్న జోడీ.. మూడు సార్లు యూఎస్ చాంపియన్‌గా నిలిచిన రాజీవ్ రామ్-జో సాలిస్‌బరితో తలపడనుంది. గెలిస్తే రెండో అడిలైడ్ ఇంటర్నేషనల్ టైటిల్ బోపన్న ఖాతాలో చేరుతుంది. 2022లో బోపన్న-రామ్‌కుమార్ రామనాథన్‌తో కలిసి విజేతగా నిలిచాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed