భారత టెన్నిస్ స్టార్ అరుదైన ఘనత..

by Disha Web Desk 13 |
భారత టెన్నిస్ స్టార్ అరుదైన ఘనత..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న అరుదైన ఘనత సాధించాడు. ఏటీపీ మాస్టర్స్-1000 టైటిల్ గెలిచిన అతిపెద్ద వయస్కుడిగా బోపన్న రికార్డు సృష్టించాడు. బోపన్నకి ఐదో ఏటీపీ టైటిల్ కాగా.. 2017 తర్వాత గెలవడం ఇదే మొదటిసారి. కాలిఫోర్నియాలో జరిగిన ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్-1000 టోర్నీలో గెలిచి.. ఏటీపీ మాస్టర్స్ టైటిల్ నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 43 ఏళ్ల వయసులో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఈ టోర్నీలో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ ద్వయం టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో కుహ్లోప్-స్కుప్సికిటో జోడీపై 6-3, 2-6, 10-8 తేడాతో విజయం సాధించి.. ఫలితంగా టైటిల్‌ను చేజిక్కించుంది. దీంతో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్‌ను గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా రోహన్ బోపన్న(43) రికార్డు సృష్టించాడు. దీంతో కెనడాకు చెందిన డానియలె నెస్టర్ రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. 42 ఏళ్ల వయస్సులో నెస్టర్ 2015లో సిన్సినాటి మాస్టర్స్ టైటిల్‌ను సాధించాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed