చాహల్ ను వాడుకుంటున్న మరో కిలాడి లేడీ...ట్వీట్ వైరల్

by velandi.Saikiran |

టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్ ( Chahal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో స్థానం

చాహల్ ను వాడుకుంటున్న మరో కిలాడి లేడీ...ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్ ( Chahal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో స్థానం సంపాదించుకునేందుకు... దేశవాళి క్రికెట్ అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ( IPL) ఎంతో కష్టపడుతున్నారు చాహల్. అటు తన పర్సనల్ లైఫ్ లో కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కంటే ముందు తన భార్య ధనశ్రీ వర్మ కు ( Dhana Sri Verma) విడాకులు ఇచ్చి... అందరికీ షాక్ ఇచ్చారు చాహల్.

ఆమెకు విడాకులు ఇచ్చిన వెంటనే...RJ మహ్వాష్ అనే అమ్మాయితో చాహల్ తిరుగుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ దుబాయిలో జరిగినప్పటి నుంచి ఈ జంట మెరుస్తూనే ఉంది. క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరిగిన ఈ ఇద్దరు కలిసి వెళ్తున్నారు. మొన్నటి వరకు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ సమయంలో కూడా పంజాబ్ జట్టుకు సపోర్ట్ చేస్తూ చాహల్ వెంట తిరిగింది RJ మహ్వాష్.

ఈ నేపథ్యంలోనే RJ మహ్వాష్ ని ఉద్దేశించి షాకింగ్ పోస్ట్ పెట్టాడు ఓ నెటిజెన్. ధన శ్రీ వర్మ లాగానే పాపులారిటీ, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకునేందుకు చాహల్ తో RJ మహ్వాష్ ( RJ Mahvash) తిరుగుతోందని బాంబు పేల్చాడు. దీంతో వెంటనే RJ మహ్వాష్ స్పందించారు. 2019 నుంచి నేను క్రికెట్ లవర్ ని.. కొత్తగా నేను క్రికెట్ చూస్తున్నది లేదు... నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని ఫైర్ అయింది. ఒకరిని వాడుకుని వదిలేసే దాన్ని కాదంటూ పేర్కొంది. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ కూడా ఇచ్చింది.

Next Story