- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chahal-Rj: మొన్ననే విడాకులు! మరో అమ్మాయితో క్రికెటర్.. నెట్టింట హాట్ టాపిక్
టీమిండియా స్పీన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: టీమిండియా స్పీన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాడు. ఇటీవలే భార్య ధనశ్రీ వర్మతో విడాకుల కేసు నడుస్తున్న సమయంలో క్రికెటర్ చాహల్ మరో అమ్మాయితో చక్కర్లు కొడుతున్నారు. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను చాహల్ తన గర్ల్ ఫ్రెండ్‌తో వీక్షించారు. స్టేడియంలో వారు నవ్వులు చిందిస్తూ సందడి చేసిన తీరు.. నెట్టింట ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మొన్ననే భార్యకు విడాకులు ఇచ్చి.. మరో కొత్త అమ్మాయితో చాహల్ ఎంజాయ్ చస్తున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. అయితే ఈ అమ్మాయి కారణంగానే ధనశ్రీ వర్మ చాహల్‌కు విడాకులిచ్చి ఉంటుదనే మరికొందరూ అభిప్రాయాపడ్డారు. వీరిద్దరి మధ్య డేటింగ్ నడుస్తున్నట్లు పుకార్లు సైతం వచ్చాయి.
చాహల్ వెంట ఉన్న యువతి.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్‌వాశ్ (RJ Mahvash)... స్టేడియంలో మ్యాచ్‌కు ముందు వీరు సేల్ఫీలు సైతం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహ్‌వాశ్ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో వారు టీమిండియాకు గుడ్‌లక్ చెప్పారు. అయితే వీరిద్దరు కలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో వీరిద్దరి మధ్య డేటింగ్ నడిచినట్లు పుకార్లు వచ్చాయి. అయితే రేడియో జాకీ మహ్‌వాశ్ ఆ పుకార్లను ఆమె తోసిపుచ్చింది. తమపై అబద్దాలు ప్రచారం చేయవద్దని స్పష్టం చేసింది. మరోవైపు చాహల్ కూడా గతంలో ఈ పుకార్లను తోసిపుచ్చాడు. కాగా, చాహల్ విడాకుల కేసు ముంబాయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో ఇటీవల తుది విచారణ జరిగినట్లు సమాచారం.






