- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థాన్ కు మరో కొత్త కెప్టెన్..100 మందిని మార్చినా మీ రాత మారదంటూ ట్రోలింగ్!
పాకిస్తాన్ వన్డే కెప్టెన్ గా షాహీన్ అఫ్రిదిని ఫైనల్ చేసింది. ఈ మేరకు మహమ్మద్ రిజ్వాన్ ను తొలగించిన పాకిస్తాన్

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ వన్డే కెప్టెన్ గా షాహీన్ అఫ్రిదిని ఫైనల్ చేసింది. ఈ మేరకు మహమ్మద్ రిజ్వాన్ ను తొలగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఈ మేరకు షాహీన్ అఫ్రిది పేరును అధికారికంగా వెల్లడించింది. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 3 వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే షాహీన్ అఫ్రిదికి ఈ బాధ్యతలు అప్పగించింది. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డేలకు పాకిస్తాన్ జట్టును కూడా రేపు ప్రకటించనుంది పీసీబీ. 25 సంవత్సరాల ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది తన కెరీర్ లో ఇప్పటి వరకు 66 వన్డేలు ఆడి 131 వికెట్లు తీశాడు. అంతేకాదు 2024లో న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్ కు కూడా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు మహమ్మద్ రిజ్వాన్ ను తప్పించి షాహీన్ అఫ్రిదికి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దాదాపు 2 ఏళ్లుగా ఇలా కెప్టెన్లను మార్చినప్పటికీ పాకిస్థాన్ భవితవ్యం మారలేదు. ఇక ఇప్పుడు షాహీన్ అఫ్రిదిని చేస్తే, పెద్ద ప్రయోజనం ఉండబోదని అంటున్నారు.






