టీ20 వరల్డ్‌ కప్‌ జట్టులోకి రియాన్ పరాగ్!

by velandi.Saikiran |

టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ సమయానికి వాషింగ్టన్ సుందర్ కోలుకోకపోతే, రియాన్ పరాగ్ ను బరిలోకి దించే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

టీ20 వరల్డ్‌ కప్‌ జట్టులోకి రియాన్ పరాగ్!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత జట్టు ప్లేయర్లలో కొంత మందికి గాయాలు అవుతున్న నేపథ్యంలో కొత్త ప్లేయర్లు రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు సెలెక్ట్ అయిన వాషింగ్టన్ సుందర్ ఇటీవల గాయం బారిన పడ్డ సంగతి తెలిసిందే. అయితే వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం గాయం నుంచి కోరుకుంటున్నారు.

టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ సమయానికి వాషింగ్టన్ సుందర్ కోలుకోకపోతే, రియాన్ పరాగ్ ను బరిలోకి దించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రియాన్ పరాగ్ బీసీసీఐ ఆదేశాల మేరకు ముంబైలో రిపోర్ట్ చేయబోతున్నాడట. ఫిబ్రవరి 2వ తేదీన ముంబైలో రిపోర్ట్ చేయాలని బీసీసీఐ ఆదేశాలు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే న్యూజిలాండ్ సిరీస్ ఆడుతున్న భారత జట్టులో రవి బిష్టోయ్‌ ఉన్నాడు. అయినప్పటికీ ఒక ఆల్రౌండర్ కావాలని, బీసీసీఐ యాజమాన్యం ప్రయత్నాలు మొదలుపెట్టిందట. అందుకే రియాన్ పరాగ్ ను బరిలోకి దించేందుకు సన్నద్ధమవుతోందట బీసీసీఐ.

Next Story