- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓకే ఓవర్ లో 5 సిక్సర్లు.. రియాన్ పరాగ్ సరికొత్త రికార్డు
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ రోజురోజుకు రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్న రాయల్ చాలెంజర్స్ వర్సెస్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ రోజురోజుకు రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్న రాయల్ చాలెంజర్స్ వర్సెస్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో రొమారియో షెఫార్డ్, మాత్రే ఇద్దరు అద్భుతంగా రానించగా ఇవాళ రియాన్ పరాగ్ ( Riyan Parag ) రెచ్చిపోయాడాడు. కేకేఆర్ జట్టుపై ( KKR) ఏకంగా వరుసగా 5 సిక్సర్లు బాదాడు రియాన్ పరాగ్. కేకేఆర్ బౌలర్ మొయిన్ అలీ ( MOEEN ALI ) బౌలింగ్ లో వరుసగా... ఐదు సిక్సర్లు కొట్టేశాడు ఈ యంగ్ ఆటగాడు రియాన్ పరాగ్.
ఈ తరుణంలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఇలా ఒకే ఓవర్ లో ఐదు సిక్సర్లు కొట్టిన ఐదవ ప్లేయర్ గా రియాన్ పరాగ్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు క్రిస్ గేల్ ఈ రికార్డును మొట్టమొదటగా నమోదు చేశాడు. ఆ తర్వాత రాహుల్ తేవాటియ, రవీంద్ర జడేజా, రింకు సింగ్ కూడా సాధించారు. ఈ నలుగురు ప్లేయర్ల తర్వాత రియాన్ పరాగ్ ఐదవ ప్లేయర్ గా నిలిచాడు.
ఇక అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు భారీ స్కోరే చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు.... ఆడి నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అద్భుతంగా రాణిస్తోంది రాజస్థాన్ రాయల్స్. 21 బంతుల్లో మరో 41 పరుగులు చేస్తే రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ కొట్టడం గ్యారంటీ.
𝙍𝙖𝙢𝙥𝙖𝙣𝙩 𝙍𝙞𝙮𝙖𝙣 🔥
— IndianPremierLeague (@IPL) May 4, 2025
The #RR captain is in the mood tonight 😎
He keeps @rajasthanroyals in the game 🩷
Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @rajasthanroyals | @ParagRiyan pic.twitter.com/zwGdrP3yMB






