- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంత్ ఆ విన్యాసాలే వద్దు.. రిషబ్‌కు వార్నింగ్ ఇచ్చిన డాక్టర్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్‌లో ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్‌లో ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ఘటన నుంచి కోలుకున్న పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి అదరగొడుతున్నాడు. అయితే, ఐపీఎల్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో, ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో సెంచరీ చేసిన తర్వాత పంత్ సోమర్‌సల్ట్ విన్యాసం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నాడు. దీనిపై పంత్‌కు చికిత్స అందించిన డాక్టర్ దిన్షా పార్దివాలా స్పందించారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. అలాంటి విన్యాసాలు పంత్ బాడీపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు. కానీ, సోమర్‌సల్ట్ అనవసరమని పంత్‌ను హెచ్చరించారు.‘జిమ్నాస్ట్ ఏ విధంగా అయితే శిక్షణ పొందుతాడో పంత్ అలాగే ట్రైనింగ్ అయ్యాడు. అతను చాలా చురుకైనవాడు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాడు. అందుకే ఇలాంటి సోమర్‌సల్ట్ చేస్తున్నాడు. ఈ విన్యాసాలను అతను బాగా ప్రాక్టీస్ చేశాడు. ఫర్పెక్ట్‌గానే చేశాడు కూడా. కానీ, ఇది అనవసరం.’అని చెప్పారు. కారు ప్రమాదం నుంచి పంత్ బతికి బయటపడటం అదృష్టమని అన్నారు. అలాంటి ప్రమాదాల్లో మరణించే అవకాశాలే ఎక్కువని,పంత్ చాలా అదృష్టవంతుడని చెప్పారు.






