- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ban VS Pak: సూపర్ ఓవర్ లో బంగ్లా చిత్తు.. ఆసియా కప్ ఛాంపియన్ గా పాకిస్తాన్
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ పై అద్భుత విజయం సాధించి, ఛాంపియన్ గా నిలిచింది పాకిస్తాన్.

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ లో పాకిస్తాన్ A సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై అద్భుత విజయం సాధించి, ఛాంపియన్ గా నిలిచింది పాకిస్తాన్. ఈ ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్ దశకు వెళ్లడంతో, అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. కానీ చివరకు పాకిస్తాన్ టైటిల్ కైవసం చేసుకుంది. సూపర్ ఓవర్ లో బంగ్లాదేశ్ ఆరు పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని చేధించింది చరిత్ర సృష్టించింది పాకిస్తాన్. ఇక అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 125 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా కష్టపడ్డ బంగ్లా, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 125 పరుగులు చేసింది. దీంతో ఈ ఫైనల్స్ లో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఇక ఈ సూపర్ ఓవర్ పాకిస్తాన్ కు కలిసి వచ్చింది. దీంతో ఛాంపియన్ గా నిలిచిన పాకిస్తాన్ A జట్టుకు మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) టైటిల్ అందించారు.






