Rishabh Pant car accident : మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలింపు

by Vinod kumar |   (  Updated:2023-01-21 14:39:09  IST  )

రోడ్డుప్రమాదంలో గాయపడి ఇప్పటివరకు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పంత్‌ను.. ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం ముంబయికి తరలించారు.

Rishabh Pant car accident : మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డుప్రమాదంలో గాయపడి ఇప్పటివరకు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పంత్‌ను.. ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం ముంబయికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి పంత్‌ను డిశ్చార్జ్ చేశారు. బుధవారం బీసీసీఐ చొరవతో.. తదుపరి చికిత్స అందించడం కోసం పంత్‌ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైలోని కోకిలా బేన్ ధీరుబాయ్ అంబానీ హాస్పిటల్‌ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. అతడి వైద్య ఖర్చులను భరిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. డిసెంబర్ 30 డెహ్రాడూన్-ఢిల్లీ హైవే మీద రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ముంబైలో పంత్ మోకాలి లిగ్మెంట్‌కు సర్జరీ నిర్వహించనున్నారు.

Next Story