కీపింగ్ చేయకపోతే పంత్ నాలుగో టెస్టు ఆడొద్దు : రవిశాస్త్రి

by Harish |

మూడో టెస్టులో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ నాలుగో టెస్టు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.

కీపింగ్ చేయకపోతే పంత్ నాలుగో టెస్టు ఆడొద్దు : రవిశాస్త్రి
X

దిశ, స్పోర్ట్స్ : మూడో టెస్టులో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ నాలుగో టెస్టు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ కీపింగ్ చేయడానికి ఫిట్‌గా లేకపోతే నాలుగో టెస్టు ఆడొద్దని వ్యాఖ్యానించాడు. భారత అసిస్టెంట్ ర్యాన్ టెన్ డోస్చేట్ పంత్‌ గాయంపై అప్‌డేట్ ఇస్తూ ఫామ్ ఆధారంగా అతన్ని బ్యాటర్‌గా ఆడించే ఆలోచన ఉందని చెప్పాడు. తాజాగా ఐసీసీ రివ్యూలో శాస్త్రి ఆ ఆలోచనను వ్యతిరేకించాడు. పంత్ గాయాన్ని మరింత తీవ్రతరం చేస్తుందన్నాడు. ‘పంత్ ఫీల్డింగ్ చేస్తే అధ్వానంగా ఉంటుంది. కీపింగ్ చేస్తే కనీసం చేతికి గ్లోవ్స్ ఉండటం వల్ల రక్షణ ఉంటుంది. గ్లోవ్స్ లేకపోతే గాయం ఎక్కువవుతుంది. అతను బ్యాటింగ్ చేయాలి. కీపింగ్ చేయాలి. కానీ, అతను ఈ రెండింటిలో ఒక్కటి చేయలేడు. ఫ్యాక్చర్ అయితే అతను విశ్రాంతి తీసుకుని ఐదో టెస్టుకు సిద్ధం కావాలి. అప్పుడు కోలుకోవడానికి అతనికి 9 రోజుల సమయం ఉంటుంది.’అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.


Next Story