- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా పాదం మీద ముద్ర వేశావ్.. వోక్స్ రిటైర్‌మెంట్‌పై పంత్ ఫన్నీ రియాక్షన్
వోక్స్ రిటైర్‌మెంట్‌పై పంత్ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. తన పాదంపై మాత్రం వోక్స్ కచ్చితంగా ముద్ర వేశాడంటూ జోకులు వేశాడు.

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్ క్రిస్ వోక్స్‌కు రిషభ్ పంత్ తనదైన స్టైల్‌లో సందేశం పంపాడు. తన చివరి టెస్టులో భారత్‌పై బ్యాటింగ్ చేసేందుకు గాయపడిన భుజానికి కట్టు కట్టుకొని వచ్చిన విషయాన్ని అతనికి పంత్ గుర్తుచేశాడు. ఇక ఆ భుజానికి రెస్ట్ ఇవ్వొచ్చంటూ జోక్ చేశాడు. ‘హ్యాపీ రిటైర్‌మెంట్ వోక్సీ. నువ్వు మైదానంలో అద్భుతంగా ఆడావు. చాలా క్రమశిక్షణ, పెద్ద నవ్వు, గుడ్ వైబ్స్‌తో ఉండేవాడివి. ఇక నీ బౌలింగ్ చేత్తోపాటు నా కాలికి కూడా రెస్ట్ ఇవ్వొచ్చు. రిటైర్ అయ్యే ముందు నా కాలిపై మాత్రం నీ మార్క్ వదిలావు. నీ భవిష్యత్ ప్రయాణం గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’ అని పంత్ పోస్టు పెట్టాడు. ఇంగ్లండ్‌తో ఆడిన మాంచెస్టర్ టెస్టులో వోక్స్ వేసిన యార్కర్.. నేరుగా పంత్ పాదాన్ని తాగి తీవ్రగాయమైంది. దీంతో మిగతా సిరీసులో పంత్ ఆడలేకపోయాడు. ఆ విషయాన్నే ఇలా గుర్తుచేశాడీ వికెట్ కీపర్ బ్యాటర్.






