- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే న్యూజిలాండ్ తో మ్యాచ్..వన్డే సిరీస్ నుంచి ఆ ప్లేయర్ ఔట్ !
రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో అతని నడుముపై భాగంలో బంతి బలంగా తాకిందట. దీంతో అక్కడే కుప్పకూలినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ కొత్త సంవత్సరంలో భారత్ ఆడే తొలి సిరీస్ ఇదే. అయితే రేపటి నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భారత జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. భారత జట్టుకు చెందిన స్టార్ ఆటగాడు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. దీంతో అతడు ఈ మూడు వన్డేల సిరీస్ కు దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో కాదు.. భారత జట్టు యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్.
వన్డే సిరీస్‌కు రిషబ్ పంత్ దూరం ?
వడోదర వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రేపు మధ్యాహ్నం మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే BCA స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్ ముమ్మరంగా చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో భారత స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో అతని నడుముపై భాగంలో బంతి బలంగా తాకిందట. దీంతో అక్కడే కుప్పకూలినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత భారత జట్టుకు చెందిన ఫిజియోథెరపీ సిబ్బంది సహాయంతో గ్రౌండ్ వీడాడు పంత్. ఇక అతని గాయం చాలా తీవ్రమైనదని చెబుతున్నారు. దీంతో న్యూజిలాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు రిషబ్ పంత్ దూరం కాబోతున్నట్లు కూడా చర్చ జరుగుతోంది. దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రిషబ్ పంత్ జట్టు నుంచి దూరమైతే, బ్యాకప్ వికెట్ కీపర్ ఈశాన్ కిషన్ బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు.






