- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిష్టాత్మక అవార్డుకు పంత్ నామినేట్.. సచిన్ తర్వాత ఆ ఘనత సాధించింది అతనే
టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యాడు. ‘బెస్ట్ కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ కేటగిరీ అవార్డు రేసులో నిలిచాడు.డిసెంబర్ 2022లో పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాదాపు 14 నెలల తర్వాత పంత్ కోలుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. గతేడాది ఐపీఎల్‌తో పునరాగమనం చేసిన అతను ఆ తర్వాత జాతీయ జట్టులోకి కూడా రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్ సభ్యుడు.
కారు ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి క్రికెట్ ఆడటాన్ని గుర్తించిన లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ పంత్‌ను ‘బెస్ట్ కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు నామినేట్ చేసింది. పంత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన మరో ఐదుగురు ఈ అవార్డుకు పోటీపడుతున్నారు. బ్రెజిలియన్ జిమ్నాస్ట్ రెబెకా ఆండ్రేడ్, స్విమ్మర్లు అరియార్నే టిట్మస్(ఆస్ట్రేలియా), కేలెబ్ డ్రెస్సెల్(అమెరికా), బైక్ సైకిల్ రేసర్ మార్క్ మార్క్వెజ్(స్పెయిన్), ఆల్పైన్ స్కీ రేసర్ లారా గట్-బెహ్రామి(స్విట్జర్లాండ్) అవార్డు రేసులో ఉన్నారు. ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఏప్రిల్ 21న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన రెండో భారత క్రికెటర్ పంతే కావడం విశేషం.
- Tags
- Rishabh Pant






