- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో రికార్డుకు చేరువలో రిషబ్ పంత్
భారత్-ఇంగ్లండ్ (India-England) మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ (Rishabh Pant) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత్-ఇంగ్లండ్ (India-England) మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ (Rishabh Pant) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో (134, 118) సెంచరీలు చేశాడు. ఆ తరువాత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 25, 65, 74, 9 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌ల్లో 6 ఇన్నింగ్స్‌ల్లో 425 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా ఉన్నాడు.
రిషబ్ పంత్ ఇంకా మిగిలిన రెండు టెస్టుల్లో కూడా ఇలాంటి దూకుడు ప్రదర్శన ఇస్తే, గత 59 ఏళ్లుగా చెరిగని ఘనతను సాధించే అవకాశం ఉంది. 1966-67లో దక్షిణాఫ్రికా తరఫున ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో వికెట్ కీపర్ డెనిస్ లిండ్సే 606 పరుగులు చేశారు. అది ఇప్పటికీ వికెట్ కీపర్‌గా ఒక టెస్టు సిరీస్‌లో చేసిన అత్యధిక రన్స్‌గా నిలిచింది. ఇప్పుడు రిషబ్ పంత్ ఆ మైలురాయికి చేరువగా ఉన్నాడు. మిగిలిన రెండు టెస్టుల్లో మరో 181 పరుగులు చేస్తే, ఈ అరుదైన ప్రపంచ రికార్డు పంత్ పేరుపై నమోదు కానుంది. దీంతో ఐదే టెస్టుల్లో ఒక వికెట్ కీపర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పంత్ చరిత్రలో నిలవనున్నాడు.






