- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
INDvsENG: రిషబ్ పంత్.. బ్యాక్ టు బ్యాక్ సెంచరీ
by Gantepaka Srikanth |
ఇంగ్లండ్(England)తో జరుగుతున్న టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్(England)తో జరుగుతున్న టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. మొదటి టెస్టు ఫస్ట్ ఇన్సింగ్స్‌లో సెంచరీ చేసిన పంత్.. సెకండ్ ఇన్సింగ్స్‌లోనూ అదరగొట్టాడు. మరోసారి సూపర్ సెంచరీ చేశారు. 130 బంతుల్లో ఈ మార్కు అందుకున్నారు. ఆయన ఇన్నింగ్సులో 13 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. టెస్టుల్లో పంత్‌కు ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం. తొలి ఇన్నింగ్సులో పంత్ 134 పరుగులు చేసి ఔటైన విషయం తెలిసిందే. అటు మరో బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఇప్పటికే సెంచరీ చేశారు. ప్రస్తుతం మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 274 పరుగులు చేసింది. 280 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. రిషబ్ పంత్ (105 నాటౌట్) పరుగులు చేశారు. వీళ్లు ఇలాగే నిలకడగా రాణిస్తే ఇంగ్లండ్ ఎదుట భారీ టార్గెట్ పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Next Story






