IND VS ENG : పంత్‌కు గాయం.. గాయంతో విలవిలలాడిపోయిన రిషబ్

by Harish |

టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ గాయపడ్డాడు.

IND VS ENG : పంత్‌కు గాయం.. గాయంతో విలవిలలాడిపోయిన రిషబ్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ గాయపడ్డాడు. నాలుగో టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా అతని కుడి కాలుకు తీవ్ర గాయమైంది. క్రిస్ వోక్స్ వేసిన 68వ ఓవర్‌లో పంత్ స్వీప్ షాట్ ఆడగా బంతి మిస్ అయ్యింది. బాల్ డైరెక్ట్‌గా పాదంపై పడటంతో పంత్ నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చూశాడు. షూ తీసి చూడగా పాదం నలిగిపోయింది. రక్తం కూడా వచ్చింది. దీంతో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతుండటంతో అతన్ని మొబైల్ అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. పంత్‌ను స్కానింగ్ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్టు సాయి సుదర్శన్ తెలిపాడు. గాయం తీవ్రంగానే కనిపిస్తుంది. మిగతా మ్యాచ్‌ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అతను దూరమైతే జట్టుకు భారీ ఎదురుదెబ్బే. మూడో టెస్టులో పంత్ వేలికి గాయమైన విషయం తెలిసిందే.


Next Story