రిచర్డ్స్ రికార్డు బద్దలు కొట్టిన రిషబ్ పంత్

by velandi.Saikiran |

టీమిండియా (Team India) వర్సెస్ ఇంగ్లాండ్ (England ) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ నేపథ్యంలో... వికెట్ కీపర్ రిషబ్ పంత్

రిచర్డ్స్ రికార్డు బద్దలు కొట్టిన రిషబ్ పంత్
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా (Team India) వర్సెస్ ఇంగ్లాండ్ (England ) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ నేపథ్యంలో... వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మరో అరుదైన రికార్డు తన సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు పైన అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ తరుణంలోనే వివి రిచర్డ్స్ రికార్డు కూడా బద్దలు కొట్టాడు రిషబ్ పంత్. తాజా మ్యాచ్ లో 112 బంతుల్లో 74 పరుగులు చేసిన రిషబ్ పంత్ అనుకోకుండా రనౌట్ అయ్యాడు.

అయితే ఈ మ్యాచ్ లో అప్పటికే రెండు సిక్సర్లు కొట్టి.. చరిత్ర సృష్టించాడు. ఈ రెండు సిక్సర్లతో ఇంగ్లాండ్ పై మొత్తం 36 సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్ గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు వెస్టిండీస్ జట్టుకు సంబంధించిన రిచర్డ్స్ 34 సిక్సర్లు ఇంగ్లాండ్ జట్టుపై సాధించాడు. అయితే ఇప్పుడు ఆ రికార్డును... దాటేశాడు పంత్. ఇక అటు రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును టీమిండియా బ్యాటర్ల తరఫున సమం చేసాడు పంత్. ఇది ఇలా ఉండగా... ఇవాళ లంచ్ బ్రేక్ సమయానికి.. అనుకోకుండా రిషబ్ పంత్ వికెట్ కోల్పోయింది టీమిండియా. అనవసర పరుగు కోసం... పరిగెత్తిన పంత్ రన్ అవుట్ అయ్యాడు. దీంతో.. లంచ్ సమయానికి 65.3 ఓవర్లు ఆడిన టీమిండియా... నాలుగు వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది.

టెస్ట్‌లలో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయులు

వీరేంద్ర సెహ్వాగ్ - 91

రిషబ్ పంత్ - 88

రోహిత్ శర్మ - 88

ఎంఎస్ ధోని - 78

రవీంద్ర జడేజా - 72

Next Story