ఇదేం ర్యాగింగ్ రా.. SRH ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్న KKR ప్లేయర్స్.. !

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad )

ఇదేం ర్యాగింగ్ రా.. SRH ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్న KKR ప్లేయర్స్.. !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad ) జట్టు దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. తాజాగా... మరో ఓటమి మూటగట్టుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ( Kolkata Knight Riders ) చేతిలో... గురువారం రాత్రి 80 పరుగులు తేడాతో ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ). అయితే ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత... సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad ) ఫ్యాన్స్ కు ( Fans) కోపం వచ్చేలా కేకేఆర్ ప్లేయర్లు కుప్పిగంతులు వేశారు. కేకేఆర్ ప్లేయర్లు రింకు సింగ్ ( Rinku singh), వెంకటేష్ అయ్యర్ ( venkatesh iyer), అలాగే బౌలింగ్ కోచ్ బ్రావో ( Bravo) ముగ్గురు కలిసి... ఓ పాటకు స్టెప్పులెస్తు కనిపించారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ పైన.. గెలిచినందుకుగాను తమకు ఎంతో కృషిగా... కామెంట్స్ చేస్తూ మరి.. డాన్స్ వేశారు. ఇక వాళ్ల డాన్స్ చూసిన హైదరాబాద్ ఫ్యాన్స్... ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవంగా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ పై కేకేఆర్ గెలవడానికి కారణం రింకు సింగ్ అలాగే వెంకటేష్ అయ్యర్. ఈ మ్యాచ్ లో రింకు సింగ్ 32 పరుగులతో దుమ్ము లేపగా... వెంకటేష్ అయ్యర్ 60 పరుగులు చేశాడు. అంతకు ముందు మ్యాచ్ లలో ఈ ఇద్దరు ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. కానీ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ అంటే రెచ్చిపోయారు. ఈ దెబ్బకు హైదరాబాద్ ఓడిపోయింది. ఇక మ్యాచ్ అనంతరం చిందులు వేస్తూ ఈ ప్లేయర్లిద్దరూ ఎంజాయ్ చేశారు.

Next Story