- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంజీలో మరో భారీ శతకంతో చెలరేగిన రింకూ.. టెస్టు టీంలోకి తీసుకుంటారా?
రంజీట్రోఫీలో రింకూ సింగ్ మరో భారీ శతకంతో చెలరేగాడు. ఇంత ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను టెస్టు టీంలోకి తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.

దిశ, స్పోర్ట్స్: టీ20 బ్యాటర్ రింకూ సింగ్.. రెడ్ బాల్ ఫార్మాట్లో కూడా తను అద్భుతమైన ఆటగాడినని నిరూపించుకుంటున్నాడు. ఆంధ్రతో జరిగిన మ్యాచులో 165 పరుగులతో అజేయంగా నిలిచి ఆకట్టుకున్న అతను.. తాజాగా తమిళనాడుతో రంజీ మ్యాచులో కూడా భారీ శతకంతో చెలరేగాడు. యూపీ తొలి ఇన్నింగ్సులో 176 పరుగులతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో తమిళనాడు 455 పరుగులు చేయగా.. రింకూ సెంచరీతో యూపీ 460 పరుగులు చేసింది. చివరి రోజు తమిళనాడు రెండో ఇన్నింగ్సులో 103/2 స్కోరు వద్ద ఉండగా మ్యాచ్ డ్రాగా ముగించారు. అద్భుతంగా ఆడిన రింకూకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
టెస్టు టీంలోకి రింకూ?
టెస్టుల్లో టీమిండియా మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తున్న సమయంలో రింకూ ఇలా చెలరేగుతుండటం గమనార్హం. ఇది చూసిన పలువురు అతన్ని టీమిండియా టెస్టు జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 42 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన రింకూ.. 59పైగా సగటుతో 9 సెంచరీలు చేయడం గమనార్హం.






