యువ సంచలనంగా మారుతున్న Rinku Singh

by Malleboina Mahesh |   (  Updated:2023-11-27 07:06:05  IST  )

ఐపీఎల్ 2023లో కలకత్తా జట్టు తరపున ఆడి మెరుపు ఇన్నింగ్స్ తో తన జట్టుకు విజయాలు అందించిన రింకు సింగ్ ప్రస్తుతం ఓ యువ సంచలనంగా మారాడు.

యువ సంచలనంగా మారుతున్న Rinku Singh
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో కలకత్తా జట్టు తరపున ఆడి మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టుకు విజయాలు అందించిన రింకు సింగ్ ప్రస్తుతం ఓ యువ సంచలనంగా మారాడు. ఐపీఎల్ ఫామ్ తర్వాత ఆగస్టు ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ కు రింకు సెలక్ట్ అయ్యాడు. తనకు అవకాశం వచ్చిన మొదటి మ్యాచ్ లోనే భారీ షాట్లు కొడుతూ.. బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20 సిరీస్ లలో కూడా రింకు అలాగే రెచ్చిపోతున్నాడు.

మొదటి మ్యాచ్ లో చివరి బంతి వరకు ఉండి సిక్సర్ తో జట్టుకు విజయం అందించాడు. అలాగే ఆదివారం జరిగిన మ్యాచ్ లో చివర్లో బ్యాటింగ్ వచ్చిన రింకు సింగ్ కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులు చేసి.. భారత్ 235 పరుగుల చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా.. రింకు సింగ్ తన చివరి నాలుగు మ్యాచుల్లో 38, 37*, 22* 31* పరుగులు చేశాడు. దీంతో భారత్ ను ఎప్పటినుంచో వేధిస్తున్న మిడిల్ ఆర్డర్ ఫినిషర్ కొరతను రింకు సింగ్ భర్తీ చేయగలడని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story