- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 వరల్డ్ కప్ లో అతనే టాప్ స్కోరర్ - రికీ పాంటింగ్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ( Ricky Ponting) సంచలన కామెంట్స్ చేశారు. భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మను ( Abhishek Sharma) మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేశారు పాంటింగ్.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ( T20 World Cup 2026) టోర్నమెంట్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ( Ricky Ponting) సంచలన కామెంట్స్ చేశారు. భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మను ( Abhishek Sharma) మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేశారు పాంటింగ్. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో అభిషేక్ శర్మకు అసలు తిరుగు ఉండదని వ్యాఖ్యానించారు. అతడే ఈ టోర్నమెంట్ లో టాప్ స్కోరర్ గా నిలుస్తాడని కూడా జోష్యం చెప్పారు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు.
ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా అభిషేక్ శర్మకు వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం టీ20 క్రికెట్ లో నెంబర్ వన్ ఆటగాడిగా అభిషేక్ శర్మ కొనసాగుతున్నాడని వివరించారు. తన మెరుపు బ్యాటింగ్ తో భారత జట్టును ఛాంపియన్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటూ కితాబిచ్చారు. అభిషేక్ శర్మ పట్ల ప్రత్యర్థి జట్లు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. లేకపోతే అతడి ఆటను తట్టుకోవడం ఎవరి వల్ల కాదన్నారు.
ఇది ఇలా ఉండగా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 8వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. భారత్, శ్రీలంక వేదికగా ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. అయితే ఈ టోర్నమెంట్ నుంచి ఇప్పటికే బంగ్లాదేశ్ వైదొలిగింది. పాకిస్తాన్ కూడా ఇలాంటి డ్రామాలు ఆడిన సంగతి తెలిసిందే. కానీ చివరి క్షణంలో టోర్నమెంట్ ఆడేందుకు ఒప్పుకుంది. కానీ ఇండియాతో మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.






