- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ricky Ponting : గంభీర్ ను తొలగించి, యువరాజ్ కు ఛాన్స్ ఇవ్వండి..!
పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోచ్ గా గౌతమ్ గంభీర్ స్థానంలో యువరాజు ను నియమిస్తే చాలా బాగుంటుందని సూచనలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ హయాంలో భారత జట్టు ఒక్క మ్యాచ్ సరిగ్గా గెలవడం లేదని మాజీ సీనియర్ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు. ఇక రవి శాస్త్రి లాంటి వాళ్లు గౌతమ్ గంభీర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ హీరో రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ స్థానంలో యువరాజు సింగ్ ను నియమిస్తే చాలా బాగుంటుందని సూచనలు చేశారు. యువరాజు హెడ్ కోచ్ అయితే భారత జట్టును ఓడించడం చాలా కష్టమంటూ వ్యాఖ్యానించారు. పరోక్షంగా గౌతమ్ గంభీర్ ను తొలగించాలని సూచనలు చేశారు పాంటింగ్. కోచ్ గా యువరాజ్ సింగ్ బాధ్యతలు తీసుకుంటే భారత జట్టు స్వరూపమే మారుతుందని వెల్లడించారు. ఆ దిశగా బీసీసీఐ ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పారు.






