Ind vs SA: మ‌హిళ‌ల జ‌ట్టులో మ‌రో ధోని..9 ఓవ‌ర్ల‌లో 97 ప‌రుగులు !

by velandi.Saikiran |

నేపథ్యంలోనే 77 బంతుల్లో 94 పరుగులు చేసింది రిచా ఘోష్ ( Richa Ghosh). ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు

Ind vs SA: మ‌హిళ‌ల జ‌ట్టులో మ‌రో ధోని..9 ఓవ‌ర్ల‌లో 97 ప‌రుగులు !
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య ఇవాళ విశాఖ వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మరో బెస్ట్ ఫినిషర్ వెలుగులోకి వచ్చింది. మహేంద్ర సింగ్ ధోని తరహాలో టీమిండియా మహిళల జట్టులో కూడా తానున్నానని రిచా ఘోష్ అద్భుతమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయింది. సౌతాఫ్రికా దెబ్బకు టీమిండియా బ్యాట‌ర్లు కకావికలం అవుతున్న నేపథ్యంలో, అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలోనే 77 బంతుల్లో 94 పరుగులు చేసింది రిచా ఘోష్ ( Richa Ghosh). ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు 11 బౌండరీలు ఉన్నాయి. దీంతో 49.5 ఓవర్స్ ఆడిన మహిళల టీమ్ ఇండియా జట్టు 251 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలవాలంటే 252 పరుగులు చేయాల్సి ఉంది. అయితే చివరలో రిచా ఘోష్ చేసిన విధ్వంసానికి 9 ఓవర్లలోనే 97 పరుగులు రాబ‌ట్టింది టీం ఇండియా. 42 ఓవర్ల‌ నుంచి 50 ఓవర్ల వరకు దాదాపు 100 పరుగులు సాధించారు. దీంతో రిచా ఘోష్ బెస్ట్ ఫినిషర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. క్లిక్

Next Story