- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంపై మౌనం వీడిన గిల్.. దేశాన్ని గెలిపించాలనుకున్నా అంటూ కీలక వ్యాఖ్యలు

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన భారత జట్టులో టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు స్థానం దక్కని విషయం తెలిసిందే. సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపర్చగా.. క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. తనను ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంపై గిల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ముందు శనివారం వడోదరలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక కానుందుకు బాధపడ్డాడని తెలిపాడు. అయితే, సెలెక్టర్ల నిర్ణయం గౌరవిస్తానని చెప్పాడు. ఏది రాసి ఉంటే అదే జరుగుతుందంటూ వ్యాఖ్యానించాడు.
‘ప్రపంచకప్ ఆడాలని, దేశం కోసం నీ జట్టును గెలిపించాలని ఏ ప్లేయరైనా అనుకుంటాడు. కచ్చితంగా ప్రపంచకప్‌కు ఎంపిక కావకపోవడం బాధపట్టేదే. సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. మన జట్టు వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నా.’అని గిల్ తన మనసులోని మాటలను బయటపెట్టాడు. ఓ క్రీడాకారుడిగా వర్తమానంలోనే ఉండటం చాలా ముఖ్యమని తెలిపాడు. ‘ఏం జరుగుతుందో, ఏం జరిగిందో అనే విషయాలపై ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచింది. అప్పుడే విజయం సాధించడానికి మంచి అవకాశం దొరుకుతుంది. నేను అదే విధానాన్ని ఫాలో అవుతా. ప్రస్తుతం నాకు ఏం కావాలో, ఈ క్షణంలో నాకు ఇది ముఖ్యమో, ఏది అవసరమో అనే విషయాలపైనే ఫోకస్ పెట్టా.’అని గిల్ చెప్పుకొచ్చాడు. 2009లో గిల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి మూడు టీ20 ప్రపంచకప్‌లు జరిగాయి. నాలుగోది జరగబోతోంది. అతను ఏ టీ20 ప్రపంచకప్ జట్టులోనూ భాగం కావకపోవడం గమనార్హం.






