- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నస్వామి స్టేడియంపై నివేదిక.. ప్రపంచకప్ మ్యాచ్‌లపై సందిగ్ధత
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ప్రముఖ చిన్నస్వామి స్టేడియంపై (Chinnaswamy Stadium) తాజాగా విడుదలైన జస్టిన్ జాన్ మైఖేల్ కమిషన్ నివేదిక సంచలనంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ప్రముఖ చిన్నస్వామి స్టేడియంపై (Chinnaswamy Stadium) తాజాగా విడుదలైన జస్టిన్ జాన్ మైఖేల్ కమిషన్ నివేదిక సంచలనంగా మారింది. ఈ నివేదిక ప్రకారం స్టేడియం భారీగా వీక్షకులను ఆహ్వానించేందుకు తగిన సురక్షత మౌలిక సదుపాయాలను కలిగి లేదని తేలింది. అత్యవసర సమయంలో వెంటనే సరైన చర్యలు తీసుకోలేకపోవడం, గేట్ల విస్తీర్ణం తక్కువగా ఉండటం, అగ్నిమాపక సదుపాయాల్లో లోపాలు ఉన్నట్టు కమిషన్ స్పష్టం చేసింది. కమిషన్ తన నివేదికలో స్టేడియం విస్తరణలపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. కొన్ని నిర్మాణాలు స్థానిక పురపాలక సంస్థల అనుమతులు లేకుండా జరిగాయని, అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండా కొన్ని బ్లాకులు ఉపయోగంలోకి తీసుకురావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్ర క్రీడాశాఖ, నగర పాలక సంస్థలు సమగ్ర సమీక్ష చేయాలని సూచించింది.
అయితే, ఈ ఏడాది చివర్లో జరిగే మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో కొన్ని కీలక మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే తాజా నివేదిక వెలుగులోకి రావడంతో అక్కడ మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారులతో కమిషన్ సూచనలు చర్చనీయాంశంగా మారాయి. భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ వేదికల ఎంపికపై అధికారులు ఆలోచనల్లో పడ్డారు. పరిస్థితిని బట్టి, ప్రపంచకప్ మ్యాచ్‌ల వేదికలపై తుది నిర్ణయం వెలువడే అవకాశముంది.






