- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాహల్ కు బిగ్ షాక్..అన్‌ఫాలో చేసిన మహ్వాశ్!
భారత జట్టులో స్థానం కోల్పోయిన చాహల్ ( Yuzvendra Chahal ) జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టులో స్థానం కోల్పోయిన చాహల్ ( Yuzvendra Chahal ) జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చాహల్ కు ఆర్జే మహ్వాశ్ ( Rj Mahvash) గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి చాహల్, ఆర్జే మహ్వాశ్ ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ధన శ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆర్జే మహ్వాశ్ తోనే కనిపించాడు చాహల్. ఈ ఇద్దరు దుబాయ్, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఎంజాయ్ కూడా చేశారు.
అయితే తాజాగా ఈ జంట గురించి సోషల్ మీడియాలో కొత్త న్యూస్ బయటకు వచ్చింది. ఓ చిన్న ఇష్యూ కారణంగా చాహల్, మహ్వాశ్ విడిపోయారట. దీంతో సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో కూడా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆర్జే మహ్వాశ్ కారణంగానే గొడవ జరిగినట్లు టాక్ నడుస్తోంది. దీంతో మళ్లీ చాహల్ సింగిల్ అయిపోయాడు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
మొదటి భార్యకు చాహల్ విడాకులు
ప్రేమించి పెళ్లి చేసుకున్న తన మొదటి భార్య ధనశ్రీ వర్మకు చాహల్ ఇప్పటికే విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాలపాటు కాపురం చేసి ఆమెను వదిలించుకున్నాడు. ఈ ఇద్దరికీ 2025లో ముంబై ఫ్యామిలీ కోర్టు.. విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా నాలుగు కోట్లకు పైగా భరణం ఇచ్చాడట చాహల్.






