రద్దైన టీ20 మ్యాచ్ టికెట్స్ డబ్బులు రిఫండ్

by Muthe.Rajitha |

భారత్-సౌతాఫ్రికా మధ్య ఈనెల 17న లక్నోలో జరగాల్సిన 4వ టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.

రద్దైన టీ20 మ్యాచ్ టికెట్స్ డబ్బులు రిఫండ్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్-సౌతాఫ్రికా మధ్య ఈనెల 17న లక్నోలో జరగాల్సిన 4వ టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ రద్దవడంతో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు పూర్తి రిఫండ్ ఇస్తామని ఉత్తరప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (UPCA) ప్రకటించింది. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు ఆటోమేటిక్‌గా వారి ఒరిజినల్‌ పేమెంట్‌ మోడ్‌ (బ్యాంక్‌ అకౌంట్‌ లేదా కార్డ్‌)కు తిరిగి జమ అవుతుందని, దీనిపై రిజిస్టర్డ్‌ ఈమెయిల్‌కు సమాచారం అందుతుందని తెలిపింది. రానున్న 5 నుంచి 10 రోజుల్లో రిఫండ్ జమ అవుతుందని పేర్కొంది.

కౌంటర్‌ లేదా బాక్స్‌ ఆఫీస్‌లో టికెట్లు కొన్నవారు డిసెంబర్‌ 20, 21, 22 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎకానా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం గేట్‌ నంబర్‌ 2 వద్ద ఉన్న బాక్స్‌ ఆఫీస్‌కు వెళ్లి ఒరిజినల్‌ టికెట్లు చూపించి రిఫండ్‌ పొందవచ్చని వెల్లడించింది. కాగా BCCI పాలసీ ప్రకారం ఒక్క బాల్‌ కూడా వేయకుండానే మ్యాచ్‌ రద్దవడంతో టికెట్స్ పూర్తి రిఫండ్‌ హక్కు ఉంటుందని UPCA స్పష్టం చేసింది.

Next Story