- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Record: 27 పరుగులకే విండీస్ ఆలౌట్.. 78 ఏళ్ల నాటి రికార్డు బద్దలు
వెస్టిండీస్ (West Indies)తో కింగ్‌స్టన్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా (Australia) సంచలనం సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ (West Indies)తో కింగ్‌స్టన్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా (Australia) సంచలనం సృష్టించింది. కరేబియర్ జట్టును ఏకంగా 27 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 5 వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 15 బంతుల్లోనే 5 వికెట్లు తీసిన స్టార్క్ తాను ఆడుతున్న 100వ టెస్ట్‌లో అరుదైన ఘనతను సాధించాడు. పేస్ బౌలింగ్ ధాటికి కకావికలమైన విండీస్ జట్టు 27 పరగులకే చాప చుట్టేయండంతో ఆసిస్ 176 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0తో విండీస్‌ను వైట్ వాష్ చేసింది. సెకండ్ ఇన్సింగ్స్‌లో మొత్తం 7.3 ఓవర్లు వేసి స్టార్క్ 15 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే అతను 78 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. 1947లో ఆస్ట్రేలియా బౌలర్ ఎర్నీ తోషాక్ (Ernie Toshack) 19 బంతుల వ్యవధిలోనే 5 వికెట్లు తీసాడు. బ్రిస్బేన్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఆ రికార్డను నెలకొల్పాడు.






