- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీకేఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన ఇరాన్ ప్లేయర్ షాడ్లౌయ్.. అతన్ని గుజరాత్ ఎంతకు కొనుగోలు చేసిందో తెలుసా?
ఇరాన్ కబడ్డీ ప్లేయర్ ఎండీ రెజా షాడ్లౌయ్ మరోసారి జాక్‌పాట్ కొట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : ఇరాన్ కబడ్డీ ప్లేయర్ ఎండీ రెజా షాడ్లౌయ్ మరోసారి జాక్‌పాట్ కొట్టాడు. శనివారం మొదలైన పీకేఎల్ 12వ సీజన్ రెండు రోజుల వేలంలో షాడ్లౌయ్‌ను గుజరాత్ జెయింట్స్ అతన్ని రూ.2.2 కోట్లకు దక్కించుకుంది. దీంతో పవర్ సెహ్రావత్(రూ.2.60 కోట్లు) మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా షాడ్లౌయ్ నిలిచాడు. అంతేకాకుండా, వరుసగా మూడో సీజన్‌లో రూ.2 కోట్ల పలికి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. షాడ్లౌయ్ తర్వాత రైడర్ దేవాంక్‌ను బెంగాల్ వారియర్స్ రూ.2.20 కోట్ల ఖర్చు చేసింది. అన్షు మాలిక్(రూ. 1.90 కోట్లు, దబాంగ్ ఢిల్లీ కేసీ), అంకిత్ జగ్లాన్(రూ.1.57 కోట్లు, పాట్నా పైరేట్స్), అర్జున్ దేశ్వాల్(రూ.1.40 కోట్లు, తమిళ్ తలైవాస్), నవీన్(రూ.1.20 కోట్లు, హర్యానా స్టీలర్స్), యోగేశ్(రూ.1.2 కోట్లు, బెంగళూరు బుల్స్), గుమాన్ సింగ్(రూ.1.07 కోట్లు, యూపీ యోధాస్) రూ. కోటిపైగా ధర పలికిన వారిలో ఉన్నారు. ఆల్‌రౌండర్ పవన్ సెహ్రావత్‌ను తమిళ్ తలైవాస్ రూ.59.5 లక్షలకు సొంతం చేసుకోగా.. మరో ఇరాన్ ఆటగాడు ఫజెల్ అట్రాచలిని రూ.30 లక్షలకే దబాంగ్ ఢిల్లీ జట్టులోకి తీసుకుంది. తొలి రోజు 26 మంది ప్లేయర్లను ఆయా జట్లు తీసుకున్నాయి. ఆదివారం కూడా వేలంలో కొనసాగుతుంది.






