- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే ఒక్క మ్యాచ్..కింగ్ కోహ్లీ ఖాతాలో 3 రికార్డులు
ఐపిఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ నేపథ్యంలో.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ( Virat Kohli) అరుదైన రికార్డు సొ

దిశ, వెబ్ డెస్క్: ఐపిఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ నేపథ్యంలో.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ( Virat Kohli) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒక్క మ్యాచ్ లోనే పలు రికార్డులు క్రియేట్ చేసి చరిత్ర సృష్టించాడు. లక్నో వర్సెస్ బెంగళూరు (Lucknow Super Giants vs Royal Challengers Bengaluru) మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ లో 54 పరుగులు చేసి.. అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ.
ఈ నేపథ్యంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అత్యధిక అర్థ శతకాలు సాధించిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఈ టోర్నమెంట్ లో 63 హాఫ్ సెంచరీలు చేశాడు. అటు విరాట్ కోహ్లీ తర్వాత డేవిడ్ వార్నర్ ( David Warner) ఇప్పటివరకు 62 అర్థ శతకాలు చేశాడు. ఇవాళ హాఫ్ సెంచరీ చేయడంతో.. వార్నర్ రికార్డు బద్దలు కొట్టాడు.
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru) తరఫున.. 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ రికార్డు కూడా ఈ మ్యాచ్ లోనే నమోదు చేశాడు. ఏకంగా 271 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు విరాట్ కోహ్లీ. ఈ ఒక్క రికార్డే కాదు అత్యధిక సార్లు ఒక సీజన్ లో 600కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా.. కూడా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇలా ఒక్క మ్యాచ్ లోనే మూడు రికార్డులు సొంతం చేసుకున్నాడు.






