చిన్నస్వామి తొక్కిసలాటపై RCB కీలక ప్రకటన

by velandi.Saikiran |

బెంగళూరులోని (Benguluru) చిన్నస్వామి స్టేడియం ( Chinna Swamy) దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై (Chinnaswamy stamped) RCB

చిన్నస్వామి తొక్కిసలాటపై RCB కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులోని (Benguluru) చిన్నస్వామి స్టేడియం ( Chinna Swamy) దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై (Chinnaswamy stamped) RCB యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి ఏకంగా 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పందిస్తూ... ఇది అత్యంత దారుణమైన ఘటన అంటూ పేర్కొంది.

బెంగళూరుకు జట్టు రాక నేపథ్యంలో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటలు తమను కలిసి వేశాయని వెల్లడించింది. అందరి క్షేమమే మాకు ముఖ్యమంటూ స్పష్టం చేసింది. తమ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెందిన అభిమానులు మృతి చెందడం చాలా బాధాకరమని ఎమోషనల్ వ్యాఖ్యలు చేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని ప్రకటన చేసింది.

ఈ సంఘటన గురించి తెలియగానే వెంటనే... తమ ప్రోగ్రాం త్వరగానే ముగించేసామని వెల్లడించింది. ప్రభుత్వ సూచనలను తాము పాటించామని.. ఫ్యాన్స్ అందరూ సేఫ్ గా ఉండాలని కోరింది. దీంతో రాయల్ చాలెంజెస్ బెంగళూరు యాజమాన్యం... చేసిన ప్రకటన వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా... చిన్న స్వామి స్టేడియం సంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. ఈ సంఘటనలో 11 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని... త్వరలోనే పరిహారం అందిస్తామని కూడా స్పష్టం చేశారు.

Next Story