- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆర్సీబీని స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన ముంబై బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?
దిశ, స్పోర్ట్స్ : డబ్ల్యూపీఎల్ సీజన్-2లో వరుసగా రెండు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు గత మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాయి. తిరిగి పుంజుకోవడంపై ఇరు జట్లు ఫోకస్ పెట్టాయి. బెంగళూరు వేదికగా శనివారం ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన బెంగళూరు 131 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆర్సీబీని స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ఎల్లీస్ పెర్రీ(44 నాటౌట్) మినహా మిగతా వారు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధాన(9), సోఫి డివైన్(9)లతోపాటు సబ్బినేని మేఘన(11), రిచా ఘోష్(7) నిరాశపర్చడంతో బెంగళూరు 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఎల్లీస్ పెర్రీ పోరాటంతో జట్టు కష్టంగా 100 పరుగుల మార్క్‌ను దాటింది. జార్జియా వారేహమ్(27) విలువైన పరుగులు జోడించింది. ముంబై బౌలర్లలో పూజ వస్త్రాకర్, నాట్ స్కివర్ బ్రంట్ రెండేసి వికెట్లు తీయగా.. వాంగ్, సైకా ఇషాక్ చెరో వికెట్ పడగొట్టారు.