RCB Vs PBSK: వెంకటేష్ అయ్యర్ విధ్వంసం.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-17 11:53:51  IST  )

ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు విరుచుకుపడ్డారు.

RCB Vs PBSK: వెంకటేష్ అయ్యర్ విధ్వంసం.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2026 (IPL-2026) సీజన్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కాగా, జితేష్ శర్మ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ..

ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుతంగా నడిపించాడు. పంజాబ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఐపీఎల్‌లో తన 67వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 58 పరుగులు చేసి స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కోహ్లీ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 29 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన అయ్యర్.. ఆఖరి వరకు నిలబడి పంజాబ్ బౌలింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. అతనికి తోడుగా ఆఖర్లో టిమ్ డేవిడ్ ధాటిగా ఆడటంతో ఆర్సీబీ స్కోరు 200 మార్కును దాటింది. ప్లేఆఫ్స్ రేసులో అధికారికంగా క్వాలిఫై అవ్వాలంటే ఆర్సీబీకి ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. మరోవైపు వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ టోర్నీలో నిలవాలంటే ఈ భారీ టార్గెట్‌‌ను ఛేజ్ చేస్తారా..? లేక చేతులెత్తేస్తారా అనేది వేచి చూడాల్సిందే మరి.

Next Story