WPL 2025 : ఆర్సీబీ జోరుకు బ్రేక్.. ముంబై థ్రిల్లింగ్ విక్టరీ

by Harish |

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరుకు బ్రేక్ పడింది.

WPL 2025 : ఆర్సీబీ జోరుకు బ్రేక్.. ముంబై థ్రిల్లింగ్ విక్టరీ
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరుకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని చూసిన ఆ జట్టుకు ముంబై ఇండియన్స్ షాకిచ్చింది. బెంగళూరు వేదికగా శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ఎల్లీస్ పెర్రీ(81) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 167/7 స్కోరు చేసింది. అనంతరం ముంబై లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది. 6 వికెట్లు కోల్పోయి 170 రన్స్ చేసి విజయతీరాలకు చేరింది. హర్మన్‌ప్రీత్ కౌర్(50) హాఫ్ సెంచరీతో రాణించగా.. నాట్ స్కివర బ్రంట్(42), అమన్‌జోత్ కౌర్(34 నాటౌట్) సత్తాచాటారు. దీంతో ముంబై వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు, ఆర్సీబీకి టోర్నీలో ఇది తొలి పరాజయం. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అమన్‌జోత్ కౌర్(3/22, 34 నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.

Next Story