ఆర్సీబీని ఎగతాళి చేసిన సెహ్వాగ్.. ఫ్యాన్స్ ఫైర్

by Harish |

ఐపీఎల్-18లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరు మీద ఉన్నది.

ఆర్సీబీని ఎగతాళి చేసిన సెహ్వాగ్.. ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరు మీద ఉన్నది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో ఆ జట్టు ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నది. అయితే, ఆర్సీబీని భారత మాజీ క్రికెటర్ ఎగతాళి చేసేలా మాట్లాడాడు. తాజాగా ఓ షోలో పాల్గొన్న అతను కీలక వ్యాఖ్యలు చేశాడు. పీఎల్‌లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్టైన ఆర్సీబీని సెహ్వాగ్ పేదలతో పోల్చాడు. ‘పేదవాళ్లను కూడా పైన ఉండనివ్వండి. ఫొటోలు తీసుకోనివ్వండి. పేదవాళ్లు ఎంతసేపు పైన ఉంారో ఎవరికీ తెలియదు. నేను డబ్బు గురించి మాట్లాడటం లేదు. ఫ్రాంచైజీలు ప్రతి సీజన్‌కు రూ.400-500 కోట్లు సంపాదిస్తున్నాయి. దాని గురించి మాట్లాడటం లేదు. ఒక్కసారి కూడా టైటిల్ గెలవని వారిని నేను పేదలు అని పిలుస్తున్నాను.’అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌‌‌గా మారగా.. సెహ్వాగ్ వ్యాఖ్యలు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించాయి. సెహ్వాగ్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.


Next Story