- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026 ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు బౌలర్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా బౌలింగ్ చేయడంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా మరో బౌలర్, శ్రీలంకకు చెందిన నువాన్ తుషారా కూడా పలు మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో తుషారా విఫలమవడమే అందుకు కారణం. ఇటీవల నిర్వహించిన టెస్టులో తుషారా అర్హత ప్రమాణాలను అందుకోలేదని ఎస్‌ఎల్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆష్లే డె సిల్వ ధ్రువీకరించారు. దీంతో ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ఎస్‌ఎల్‌సీ అతనికి నో అబ్జెక్షషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో అతను తక్షణమే ఐపీఎల్‌లో పాల్గొనలేడు. అయితే, తుషారాకు మరో చాన్స్ ఇస్తామని ఆష్లే డె సిల్వ తెలిపారు. 4-5 రోజుల తర్వాత మరోసారి ఫిట్‌నెస్ టెస్టు నిర్వహిస్తామని చెప్పారు. ఎస్‌ఎల్‌సీ గైడ్‌లైన్స్ ప్రకారం.. ఐదు ఫిట్‌నెస్ పారామీటర్లలో ఆటగాళ్లు 29 స్కోరుకుగానూ 17 స్కోరు సాధించాల్సి ఉంటుంది. రెండోసారి కూడా తుషారా ఫెయిల్ అయితే ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్టే. ఇప్పటికే బౌలర్ యశ్ దయాల్‌ను ఆర్సీబీ ఈ సీజన్‌కు దూరం పెట్టింది. హేజిల్‌వుడ్, తుషారా కూడా లేకపోతే ఆర్సీబీ బౌలింగ్ బలహీనపడుతుంది. ఇది ఆ జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపనుంది.






