ఆ 5 గురు ప్లేయర్లను వదిలించుకుంటున్న RCB..మరోసారి ఛాంపియన్ అయ్యేందుకు!

by velandi.Saikiran |

ఐదుగురు ప్లేయర్లను వదిలించుకొని ఏకంగా 16 కోట్లను పర్సులోకి తెచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది RCB.

ఆ 5 గురు ప్లేయర్లను వదిలించుకుంటున్న RCB..మరోసారి ఛాంపియన్ అయ్యేందుకు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్... అతి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే జట్ల యాజమాన్యాలు కసరత్తులు మొదలుపెట్టాయి. ఏ ప్లేయర్లను అంటిపెట్టుకొని ఉండాలి....? ఏ ప్లేయర్లను వదిలివేయాలి? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నాయి. ఇప్పటివరకు పెద్దగా రాణించని ఆటగాళ్లను జట్టులోంచి తొలగించి... కొత్త ఆటగాళ్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే మొత్తం ఐదుగురు ప్లేయర్లను వదిలించుకొని ఏకంగా 16 కోట్లను పర్సులోకి తెచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈ ఐదుగురు ప్లేయర్లలో డేంజర్ ఆటగాడు లియామ్ లివింగ్ ష్టన్, లుంగీ ఎంగిడి కూడా ఉన్నారు. అటు ఆరు కోట్ల ఆటగాడు రసిక్దర్, 30 లక్షల ఆటగాడు మనోజ్ అలాగే స్వప్నిల్ సింగ్ ను కూడా వదిలించుకోవాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణయం తీసుకుంది. ఇదే జరిగితే మళ్లీ బెంగళూరు పర్సులోకి 16.5 కోట్లు వచ్చి చేరుతాయి. ఆ డబ్బులతో వేరే ప్లేయర్లను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. కాగా ఐపిఎల్ 2025 టోర్నమెంట్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే.

Next Story