చిన్నస్వామి స్టేడియంకు ఆర్సీబీ గుడ్‌ బై..?

by Malleboina Mahesh |   (  Updated:2025-11-12 07:27:22  IST  )

ఐపీఎల్ 2026 కు ముంది ఆర్సీబీ జట్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత సీజన్ లో టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివర్లో వివిధంలో చిక్కుకుంది.

చిన్నస్వామి స్టేడియంకు ఆర్సీబీ గుడ్‌ బై..?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 కు ముంది ఆర్సీబీ (RCB) జట్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత సీజన్ లో టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివర్లో వివిధంలో చిక్కుకుంది. ఐపీఎల్ టైటిల్ విజయం తర్వాత జూన్ 4న బెంగళూరులో జరిగిన RCB విజయోత్సవ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట (stampede) ఘటన అనంతరం చిన్నస్వామి స్టేడియం తాత్కాలికంగా నిలిపివేయబడిన విషయం తెలిసిందే. అలాగే ఈ ఘటనకు ఆర్సీబీ యాజమాన్యమే కారణమని నిర్ధారించి వారిని దోషులు నిలబెట్టారు. దీంతో స్థానిక అధికారులు, ప్రభుత్వ తీరుపై జట్టు యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ హోమ్ మ్యాచ్‌లను తాత్కాలికంగా మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ (MCA) స్టేడియం, గహుంజే – పుణేలో నిర్వహించేందుకు ఆర్సీబీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

కాగా “RCB తమ హోమ్ మ్యాచ్‌లను పుణేలో ఆడే అవకాశం గురించి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతానికి హోమ్ గ్రౌండ్ మార్పుపై సాంకేతిక, లాజిస్టిక్ అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అన్ని విషయాలు సక్రమంగా సాగితే, పుణే RCB మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. 2022లో IPL మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన MCA స్టేడియం మళ్లీ లీగ్ ఉత్సాహాన్ని చూడనుంది. కానీ బెంగళూరు అభిమానులను మాత్రం ఈ నిర్ణయం షాక్ కు గురి చేస్తుంది. అలాగే వారిని వారి సొంత జట్టు మ్యాచులను హోమ్ గ్రౌండ్ లో వీక్షించడానికి దూరం చేస్తుంది. మరీ హోమ్ గ్రౌండ్ వేదిక మార్పులపై వస్తున్న వార్తలపై ఆర్సీబీ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story