- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCB: అమ్మకానికి ఆర్సీబీ ఫ్రాంచైజీ?.. టైటిల్ గెలవగానే షాకింగ్ డెసిషన్!
ఆర్సీబీ ఫ్రాంచైజీని ఆ జట్టు యాజమాన్యం విక్రయించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్-2025 ఫైనల్ విక్టరీతో తొలి ట్రోఫీని గెలిచిన ఆనందంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) అభిమానులకు ఆ జట్టు యాజమాన్యం షాకిచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు జట్టు యాజమాన్యం డియాజియో ప్రయత్నాలు చేస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జట్టును పూర్తిగా లేదా కొంత వాటాలను విక్రయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ లోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (United Spirits Ltd), డియాజియో పీఎల్సీ (Diageo Plc) ద్వారా ఆర్సీబీ జట్టును నిర్వహిస్తోంది. ఈ ఫ్రాంచైజీ విక్రయ విలువపై ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ, 2 బిలియన్ డాలర్ల వరకు విక్రయించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2008 లో ఆర్సీబీ ఫ్రాంచైజీ ప్రారంభమైనప్పుడు ఈ జట్టును కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, భారత దేశ మద్యం పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరైన విజయ్ మాల్యా కొనుగోలు చేశారు. ఆ తర్వాత రుణాల ఊబిలో చిక్కుకుపోయిన విజయ్ మాల్యా.. తన సామ్రాజాన్ని కోల్పోయారు. దాంతో మాల్యా స్పిరిట్స్ కార్యకలాపాలను డియాజియో కొనుగోలు చేయడంతో ఆర్సీబీ జట్టు ఆ సంస్థ యాజమాన్యంలోకి వెళ్లింది. కాగా ఆర్సీబీ అమ్మకానికి అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు జోరందుకున్నాయి. మంగళవారం ఉదయం స్టాక్ ధరలు 3.3 శాతం వరకు పెరిగాయి.
ఫ్రాంచైజీని అమ్మాలని బీసీసీఐకి విజ్ఞప్తులు:
ఐపీఎల్ టోర్నీలో మిగిలిన 9 జట్ల సంగతి ఒకలా ఉంటే ఆర్సీబీ పరిస్థితి మరోలా ఉంటోంది. 18 ఏళ్లుగా ఈ జట్టు ఒక్క టోర్నీ కొట్టకపోయినా మిగతా ఏ జట్టుకు లేని ఫ్యాన్ బేస్ ఉంది. అయితే జట్టు ప్రదర్శనపై విమర్శలతో పాటు యాజమాన్యం తీరుపై కూడా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. జట్టు ఎంపిక సరైన విధంగా లేదని ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడంలో యాజమాన్యం విఫలమైందనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్సీబీ టీమ్ ను మరొకరికి విక్రయించాలని భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి గతేడాది బీసీసీఐకి విజ్ఞప్తి చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టైటిల్ దక్కిన వెంటనే జట్టును విక్రయించాలనే ప్రయత్నాలు మొదలు పెట్టడం వెనకు ఇక జట్టు భారాన్ని మోయలేమనే ఆలోచనలో ఆర్సీబీ యాజమాన్యం ఉందా అనే చర్చ జరుగుతోంది.






