- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు..RCB సంచలన లేఖ
ఐపీఎల్ 2025 విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మొన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో 300 నుంచి 350 వరకు ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని బెంగళూరు కోరుతోంది. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు బహిరంగ లేఖ రాసింది బెంగళూరు జట్టు యాజమాన్యం.
2025 ఐపీఎల్ సమయంలో తొక్కిసలాట జరిగి 11మంది అభిమానులు మరణించారు. ఇలాంటి నేపథ్యంలో అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరిందట బెంగళూరు. అలా కెమెరాలు ఏర్పాటు చేస్తేనే వచ్చే సీజన్ లో చిన్నస్వామిలో మ్యాచ్ లు ఆడతామని పేర్కొందట. కెమెరాలు ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేసిందట. అయితే దీనిపై కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
కొత్త స్టేడియాలలో ఆర్సీబీ హోం మ్యాచ్ లు
ఐపీఎల్ 2025 విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మొన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో కాకుండా రాయ్‌పూర్, డీవై పాటిల్ స్టేడియాలలో హోమ్ మ్యాచ్‌లు ఆడేందుకు బెంగళూరు సిద్ధమైందట. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.






